Thursday, October 12, 2006

గుడి గంటలు

ఇది గుడి గంటలు సినిమాలో ఘంటసాల పాడిన పాట. సాహిత్యాన్ని రచించిందెవరో కానీ, ఒక్కొక్క లైన్నీ ఒకటి వంద సార్లు ఆలోచించి రానట్లుగా ఉంది. చిత్రంలో సన్నివేశానికి సర్రిగ్గా సరిపోయే పాట. సినిమాలో NTR భార్య మీద కోపంతో ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు. తర్వాత చేసిన తప్పుకు కుమిలిపోతూ పాడే పాటనుకొంటా.


జన్మమెత్తిరా అనుభవించితిరా
బ్రతుకు సమరములో పండిపోయితిరా
మంచి తెలిసి మానవుడుగా మారినానురా ||జన్మం||

స్వార్థమను పిశాచి మదిని స్వారి చేసెరా
బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయెరా || స్వార్థమను ||
దైవ శక్తి మృగత్వమునే సంహరించెరా || దైవ శక్తి ||
సమర భూమి నా హృదయం శాంతి బొందెరా ||జన్మం||

క్రోధ లోభ మోహములే పడగలెత్తెరా
బుసలు కొట్టి గుండెలోన విషము గ్రక్కెరా ||క్రోధ||
ధర్మ జ్యోతి తల్లివోలె ఆదరించెరా ||ధర్మ జ్యోతి||
నా మనసె దివ్య మందిరముగా మారిపోయెర

మట్టి యందె మాణిక్యము దాగియుండురా
మనిషి యందె మహాత్ముని గాంచగలవురా ||మట్టి||
ప్రతి గుండెలో గుడి గంటలె ప్రతిధ్వనించురా ||ప్రతి||
ఆ దివ్య స్వరం న్యాయ పధం చూపగలుగురా ||జన్మ||

జంధ్యాల మెచ్చుతునకలు

"మనిషి జీవితం బాధల, సమస్యల మయమై ఉంటుంది. అలాంటి మనిషి థియేటర్‌కు వచ్చినపుడు అతనికి కాస్త నవ్వులు పంచి నవ్వించాలన్నదే నా ధ్యేయం. అందుకే నేను ఎక్కువగా హాస్యరస ప్రధానమైన చిత్రాలు రూపొందించడానికే ఇషపడతాను. రచయితగా నేను హాస్యమే రాశాను. దర్శకుడగా హాస్యాన్నే పంచుతున్నాను. అయితే హాస్యం రాయడం, హాస్య చిత్రాన్ని రూపొందించడం చాలా కష్టమైన పనులు. కొంచెం శృతి మించితే హాస్యం అపహాస్యమవుతుంది. హాస్యానికి, అపహాస్యానికీ మధ్య రేఖా మాత్రమైన భేదం మాత్రమే ఉంటుంది. నేను నా శక్తివంచన లేకుండా హాస్యాన్ని హాస్యంగా ఉంచడం కోసమే ప్రయత్నిస్తున్నాను...'' ఇవి ఎవరి మాటలో అందరికీ అర్థమయ్యే ఉంటుంది.

నవ్వడం భోగం
నవ్వించడం యోగం
నవ్వకపోవడం రోగం

అంటూ తెలుగుచిత్ర సీమలో 1976 నుంచి 2000 వరకూ రారాజుగా వెలిగిన నవ్వులరాజు జంధ్యాల వెంకట దుర్గా శివసుబ్రహ్మణ్యశాస్త్రివి! ఆయనకి రచయితగా మూడువందల యాభై చిత్రాలు, దర్శకుడిగా 39 చిత్రాలు ఆయన సృజనాత్మకతకు శాశ్వత చిరునామాలుగా నిలిచి వెలుగుతున్నాయి. నవ్వుకోసమే జీవించిన జంధ్యాల... మెచ్చుతునకల్లాంటి ఎన్నో హాస్యగుళికలు అందించారు. వాటిల్లో జీవిత సత్యాలు, బోలెడు ప్రాసలు, సినిమా నటీనటులకు సంబంధించినవి... ఎన్నో ఉన్నాయి. తెనాలి రామలింగ కవి హాస్యాన్ని పోలిన హాస్యోక్తులు మనకు ఎన్నో కనిపస్తాయి.

* ఆ నవ్వేమిటమ్మాయ్... ఆడపల్ల కాలు గడపదాటకూడదు. నవ్వు పెదవి దాటకూడదు... తెలుసా? కారణం లేని నవ్వు, తోరణం లేని పందిరి, పూరములని బూరె పనికి రాదన్నాడు శాసకారుడు. మీకివమి తెలియవు! మీ ఇంగ్లీషు బళ్ళలో లింకన్ ఎప్పుడు పుట్టాడు? డంకెన్ ఎప్పుడుచచ్చాడు! ఇవే తప్ప... రాముడవరు, కృషుడవరు ఇవి చెప్పి తగలడరు!

* గత దశాబ్దంగా తమ ఒంపు సొంపులతో, ఆటపాటలతో ఆంధ్ర పేక్షకుల గుండెకాయల్ని వేరు శనక్కా యల్లా తినేస్తున్న సోదరీమణులు జ్యోతిలక్ష్మి, జయమాలినిల గురించి మనం చెప్పుకుందాం... ఈ సోదరీమ ణులిదరూ ఆంధ్రులపాలిట ఇషదవాలు. ఆవకాయ, గోంగూర లాంటివారు. ఈ పచ్చళ్లలో ఏదో ఒకటి లేనిద్ద్టే ఎౖ తెలుగువారి భోజనం ఎలా ఉండదో, వీరిదరిలో ఏ ఒక్కరెనా లేకుండా తెలుగు సినిమాయే అసలు ఉండదు.

* భర్త భార్యను ప్రేమించే పదతికి, భార్యభర్తను వేధించే పదతికి సరెన నిర్వచనం నా కవితారూపంలో ఇస్తా...

పెళయ్యే క్షణం దాకా ఆడది బెల్లం ముక్క
ఆ క్షణం నుంచి అదే ఆడది అల్లంచక్క-నీ పీక నొక్కో

* పన్నెండళ్ల దాకా ఆడది ఇండియా లాంటిది అందరూ ఎత్తుకుని ముద్దు పెట్టాలనుకుంటారు పన్నెండు నుంచి పదనిమిది దాకా ఆడది అమెరికాలాంటది ప్రతివాడు ఆ అందాన్ని అందుకోవాలని, పొందాలని చూస్తారు. 18 నుంచి 40 దాకా ఆడది ఇంగ్లాండ్ లాంటిది దూరం నుంచి చూసి ఆనందిస్తుంటారు 40
నుంచి 60 దాకా ఆడది ఆఫ్రికా లాంటిది చూడగానే జడుసుకొని పారిపోతారు!

* కృష్ణ గోదావరుల్లో ప్రవహించది నీరుకాదు, కన్నీరు... కట్నమిచ్చుకోలని కన్నెపలల కన్నీరు.

* ఇప్పుడే బుర్రలో ఓ మెరుపు మెరిసిందిరా. కొత్త ప్రాస కనిపెట్టాను. "క"తో ఇస్తా ఏకాకి... కాకీక కాకికకాక కోక... ఆ కాకీక కాకికి కాక కోకికా కుక్కకా...!? ఇందులో 24 "క"లున్నాయి... ఎలా ఉంది?

* పోనీ ఇంకోటిస్తా... "న" మీద
నాని నాని... నీనూనె నీనూనె నానూనె నూనె... నేనై నేను నీనూనె నా నూనేనని, నానూనె నీనూనననీఎ నిన్న నేనన్నానా ..నోనో.. నేన్నానా నున్నని నాన్నా... నెననై...ఇందు లో 56 'నాలున్నాయి లెక్కచూసుకో కావాలంటే.

* మొక్కుబడకి బుక్కులన్ని చదివినా కుక్కగొడుగు మొక్కలా, చెదలు కొటేసన చెక్కముక్కలా, కుక్కపీకేసన పిచ్చిమొక్కలా, బిక్కుమొహం వేసుకుని, వక్కనోట్లో కుక్కుతూ బొక్కుతూ డెక్కుతూ చుక్కలు లెక్కపెడుతూ, ఇక్కడే ఈ ఉక్కలో గుక్కపెట్టి ఏడుస్తూ, ఈ చుక్కల చొక్కా వేసుకుని డొక్కు వెదవలా గోళ్ళు చెక్కుకుంటూ నక్కపనుగులా చక్కిలాలు తింటూ, అరటి తొక్కలా, ముంగిట్లో తుక్కులా, చిక్కుజుట్టు వేసుకుని ముక్కు పొడి పీలుస్తూ, కోపం కక్కుతూ, పెళ్లాన్ని రక్కుతూ, పెక్కు దిక్కుమాలిన పనులు చేస్తూ రెక్కలు తెగిన అక్కుపక్షిలా నక్కినక్కి ఈ చెక్కబల్లమీద బక్కచిక్కి ఇలా పడుకోకపోతే ఏ పక్కకో ఓ పక్కకు వెళ్ళి పిక్క బలం కొద్ది తిరిగి, నీడొక్క శుద్దితో వాళని ఢక్కాముక్కీలు తినిపంచి, నీలక్కు పరీక్షించుకుని ఒక్క చక్కటి ఉద్యోగం చిక్కించుకొని, ఒక్క చిక్కటి అడ్వాన్సు చెక్కు చెక్కు చెదరకుండా పుచ్చుకుని తీసుకురావచ్చు కదరా తిక్క సన్నాసి. ఇందులో 56 'క్కా లు ఉన్నాయి తెలుసా?

* శ్రీకృష్ణ దేవరాయలు వంటి మహారాజు, కళా హృదయుడు తన మహామంత్రికి 'అప్పాజీ' అని పేరు పెట్టు కున్నాడంటే.. అప్పు ఎంత విలువనదో గ్రహించండి. ఇంగ్లీష్‌లో కూడా 'డౌన్' కంటే 'అప్' ఉన్నతమైన కాదా?

* మన భారతదశం చేసన పనే మనమూ చేయటం తప్పు కాదుకదా... మనదశం అహింసను పాటిస్తే మనమూ పాటిస్తాం. మనదశం క్రమశిక్షణ పాటిస్తే మనమూ అనుసరిస్తాం. ఇప్పుడు మనదశం ఏం చేస్తోంది? పరాయి దేశాలనుంచి వీరలెవల్లో అప్పులు చేస్తోంది. ఈ ఏడాది ప్రపంచ బ్యాంకుకు హెచ్చొ మొత్తంలో బాకీ ఉన్న దేశాల్లో మొదటది భారతదశం అయితే రెండోది బెల్జియం. అంచేత అప్పు చేయటీం తప్పు చేయటం కాదు. అసలా మాట కొస్తే అప్పుచయటం భారతీయుడి జన్మహక్కు, ప్రథమ కర్తవ్యే మూనూ.... ఏషియాడ్‌లో మన గుర్తు గున్నాఎనుగు పేరు ఏమిటి? 'అప్పూ'... మన వెజాగ్‌లో ఉన్న సింహాచలం దేవుడి పేరు ఏమిటి? సింహాద్రి "అప్ప"న్న.

* డబ్బు పెరిగినా, జబ్బు పెరిగినా ఆ తేడా ముఖంలోనే తెలుస్తుంది.

* ఫస్ట్ ఈజ్ ది ఫస్ట్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఈజ్ ది ఫస్ట్ ఆఫ్ ది లాస్,ట ఇన్ బిట్వీన్ టు జీరోస్ అంటే ఏమిటో చెప్పండి? ఫస్ట్‌లో మొదటి అక్షరం 'ఎఫ్', లాస్‌లో మొదటి అక్షరం ఎల్. ఇన్ బిట్వీన్ ట్టూ జీరోస్ అంటే ఫూల్!

* కుంతీ సెకండ్ సన్ బూన్... అదే భీమవరం... గారెన్‌కర్రీ... అదేనమ్మ తోటకూర

* ఈ మధ్య నేను కొన్ని కవితల్ని వ్రాశాను. మచ్చుకి ఒకటవిస్తాను వినండి.

''ఆకాశం రంగు నీలంగా ఎందుకుంటుంది?
ఎర్రగా ఉంటే బాగుండదు కనుక...
రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది?
నీలంగా ఉంటే బాగుండదు కనుక...
మలెతలగానే ఎందుకుంటుంది?లేల
నల్లగా ఉంటే బాగుండదు కనుకా
-ఇదివిన్నాక కూడా నేనెందుకు బ్రతికే ఉన్నాను
నాకు చావు రాలేదు కనుక!
ఇటువంటి హాస్యోక్తులు, ఛలోక్తులు, పేరడీలు, ప్రాసలు వందలకొద్దీ రాసిన జంధ్యాల రచయితగా ఎంత విజయం సాధించారో దర్శకుడిగానూ అంతే ఘనవిజయం సాధించారు.

Sunday, October 08, 2006

తోలు తిత్తి ఇది తూటులు తొమ్మిది

తోలు తిత్తి ఇది తూటులు తొమ్మిది
తుస్సుమనుట ఖాయం
ఒ జీవా తెలుసుకో అపాయం ||తోలు||

ఉప్పు తప్పుదై
ఉరుకులు తీయ్యకు
గబ్బు మేను జీవా
ఔను గబ్బిలాయి జీవ ||ఉప్పు||
ఎంత పెట్టినా ఏమి కట్టినా
కట్టెలపాలౌ పాడు కట్టెరా ||తోలు||

మూడు రోజులా ముచ్చటరా
ఈ చింత కట్టె దేహం
గాయం గుబిలిపోవు ఖాయం ||మూడు||
నీవు కట్టుకపొయేదొట్టిదిరా
మట్టిన పుట్టీ మట్టిన కలిసి ||తోలు||


వెలుతురుండగా తెరువు చూసుకో
తలచి రామ నామం
జీవా చేరు రంగధామం ||వెలుతురు||

పట్టుబట్టి ఈ లోకకపు గుట్టు
రట్టుచేసె ఈ రంగదాసుడు ||తోలు||

-------------------------------------
ఈ పాట యెన్.టీ.ఆర్ పుండరీకుడుగా నటించిన పాండు రంగ మహత్యంలోనిది. కానీ పాట చిత్రీకరణ మాత్రం మహా నటుడైన కస్తూరి శివరావు మరియు బాలకృష్ణ (ఇప్పటి హీరో బాలకృష్ణ కాదు, హాస్య నటుడు బాలకృష్ణ) మీద చిత్రీకరించడం జరిగింది. ఈ పాట ఎందుకు ఆదరణకు నోచుకోలేదో నాకర్థం కాదు. ఈ పాత పాట సాహిత్యం కోసం ఎన్నో చోట్ల వెతికాను. www.oldtelugusongs.com లో కూడా "సన్నుతి సేయవే మనసా..." పాట ఉంది తప్పితే, ఇది కాని "అమ్మా అని అరచినా...ఆలకించవేమమ్మా" పాటకానీ లేదు.ఎక్కడెక్కడో వెతకడం, ఎవరో ఈ పాట upload చేసేంతవరకు వేచి ఉండడం దండగ అనిపించి, నేనే ఈ సినిమా DVD కొనేసి, ఒకటికి ఇరవై సార్లు పాట విని లేఖిని సహాయంతో సాహిత్యాన్ని బ్లాగేశా. ఎంతో పెద్ద పెద్ద పుస్తకాలలో చెప్పిన తత్వాన్ని చాలా తేలికకగా కొన్నే లైన్లలో చెప్పిన రచయితకు నిజంగా నా ప్రణామాలు. సాహిత్యాన్నైతే బ్లాగా కానీ గాయకుల గొంతులోని మాధుర్యాన్ని కానీ, సంగీతంలోని కమ్మదనాన్ని గానీ ఆస్వాదించాలంటే, ఈ సినిమా చూడాల్సిందే.

Friday, October 06, 2006

మొదటి పోస్ట్

ముందే నాకు http://gsnaveen.wordpress.com అనే బ్లాగు ఉన్నా. ఇక్కడ కూడా బ్లాగుదామనిపించింది. దీంట్లో పూర్తిగా నా సొంత పోస్ట్ లే చేద్దామనుకుంటున్నాను. ఇంకొక కారణం, www.worpress.com లో images లోడ్ చెయ్యలేము.

నాకు సదా విజయం చేకూరుగాక :)